ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2022-10-02T04:31:20+05:30 IST

రహదారుల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు అమలు చేయాలని, ప్రజల ప్రాణాల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సంబంధిత అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం మినీ వీడి యో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా రవాణాశాఖ అధికారిణి ఎస్‌. శాంతకుమారి ఆధ్వర్యంలో జేసీ అధ్యక్షతన జిల్లా రహదా రుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జేసీ తమీమ్‌ అన్సారియా

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయాలి 

జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ తమీమ్‌ అన్సారియా 

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబరు 1: రహదారుల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు అమలు చేయాలని, ప్రజల ప్రాణాల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సంబంధిత అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం మినీ వీడి యో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా రవాణాశాఖ అధికారిణి ఎస్‌. శాంతకుమారి ఆధ్వర్యంలో జేసీ అధ్యక్షతన జిల్లా రహదా రుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కార ణంగానే అత్యధిక శాతం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నార న్నారు. జనాభాతో పాటు వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ, అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో జరిగే అన్ని రోడ్డు ప్రమాదాలను పోలీసు, రవాణా, ఇంజనీరింగ్‌, ఆరోగ్య శాఖల అధికారులు ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ డేటా బేస్‌(ఐరాడ్‌) ద్వారా ప్రతి రోడ్డు ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదాల నివా రణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను నివేదిక రూపంలో విధిగా తయారు చేయాలన్నారు. జిల్లాలో 63 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించామని, ఆయా శాఖల వారీగా ఆ బ్లాక్‌ స్పాట్‌లలో బారికేడింగ్‌, ప్రమాద సంకేత సూచిక బోర్డు లు, స్టాపర్స్‌, సిగ్నల్‌ లైట్స్‌, బ్లింకింగ్‌ లైట్స్‌ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుని ఫొటోతో సహా నివేదికను తయారు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారికి జరిమానా వేయాలని సూచించారు. తరచూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేయాలని పోలీసు శాఖకు సూచిం చారు. జిల్లా రవాణాశాఖ అధికారిణి ఎస్‌.శాంతకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో 192 రోడ్డు ప్రమాదాలు జరిగి 88 మంది మృతి చెందగా 255 మంది గాయపడ్డారని వివరించారు. అతివేగం, నిర్లక్ష్యంగా ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదానికి కారణమని పోలీసు శాఖ నివేదికలు సమర్పించారన్నారు. హెల్మెట్లు ధరించడం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుందనే విషయాన్ని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె డీఎస్పీలు పి.శ్రీధర్‌, జి.శివభాస్కరరెడ్డి, కె.రవిమనోహరాచారి, ఎంవీఐ అనిల్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఈ ఈఈలు బి.రఘునాథ్‌ బాబు, పి.మధుసూధన్‌, డీఎంహెచ్‌వో కొండయ్య, విద్యుత్‌ శాఖ ఈఈ వై.చంద్రశేఖరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాంబాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌ నాయక్‌, ఆర్టీసీ డీపీటీవో ఎం.జగదీశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more