అక్రమంగా విద్యుత్‌ వాడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-11-20T23:29:58+05:30 IST

పంట పొలాల్లో అక్రమంగా విద్యుత్‌ వాడితే కఠిన చర్యలు తప్పవని ఏడీ శేషగిరిబాబు తెలిపారు.

అక్రమంగా విద్యుత్‌ వాడితే కఠిన చర్యలు

మైలవరం, నవంబరు 20: పంట పొలాల్లో అక్రమంగా విద్యుత్‌ వాడితే కఠిన చర్యలు తప్పవని ఏడీ శేషగిరిబాబు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని రామచంద్రాయపల్లి, పొన్నంపల్లి గ్రామపొలాల్లో అక్రమంగా పంట సాగు చేసిన పొలం చుట్టూ అక్రమంగా కంచెకు విద్యుత్‌ వాడుతుండటంతో మైలవరం పోలీసులకు సమాచారం అందించామని ఆయన తెలిపారు. ఏడీ మాట్లాడుతూ మండలంలోని గంగులనారాయణపల్లి మరి కొన్ని కొండ ప్రాంతంలోని గ్రామ పొలాల్లో అక్రమంగా విద్యుత్‌ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్రమంగా విద్యుత్‌ వినియోగించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-11-20T23:30:27+05:30 IST

Read more