ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2022-11-11T23:42:33+05:30 IST

కడపలో ఉక్కు పరిశ్రమ పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చే శారు.

ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్‌

కడప (సెవెనరోడ్స్‌). నవంబరు 11: కడపలో ఉక్కు పరిశ్రమ పనులు వెంటనే ప్రారంభించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చే శారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కడపలో శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి ప్రారంభమై వనటౌన సర్కిల్‌, చెన్నూరు బస్టాండు, 2వ గాంధీ విగ్రహం మీదుగా మట్టిపెద్దపులి, చిలకలబావి సీపీఐ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్బంగా చంద్ర మాట్లాడుతూ ఏపీని మోదీ అన్ని విధాలుగా మో సం చేస్తున్నారన్నారు. స్టీలు ప్లాంటు ప్రైవేటుపరం చేయవద్దని ముక్తకంఠంతో ఆందోళనలు చూసైనా ప్రధాని మోదీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుతామని స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన తీర్మానం చేశారని, ఇప్పుడు ఏమీ చేయకుండా సాగిలపడి స్వాగతం పలకడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంవీ సుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్‌, బషీరున్నిసా, విజయలక్ష్మి, నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా, జిల్లా సమితి సభ్యుడు సావంత సుధాకర్‌, మునయ్య, లింగన్న,ఆర్‌,బాబు, బాషా, భవాని శంకర్‌, ఫక్కీరప్ప, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యద ర్శి వలరాజు, సుబ్బరాయుడు, నాయకులు శివ, ఇన్సాఫ్‌ నగర కార్యదర్శి మైనుద్దీన పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:42:33+05:30 IST

Read more