-
-
Home » Andhra Pradesh » Kadapa » State future is with TDP Kasturi-MRGS-AndhraPradesh
-
టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: కస్తూరి
ABN , First Publish Date - 2022-10-05T05:14:18+05:30 IST
టీడీపీ తోనే రాష్ట్రానికి భవిష్యత్తు అన్న విషయం ప్రజలు గుర్తించా రని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాఽథ నాయుడు అన్నారు.

చిట్వేలి, అక్టోబరు4 : టీడీపీ తోనే రాష్ట్రానికి భవిష్యత్తు అన్న విషయం ప్రజలు గుర్తించా రని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాఽథ నాయుడు అన్నారు. మంగళవారం మండల టీడీనీ అధ్యక్షుడు కె.కె.చౌదరితో కలిసి తుమ్మకొండ, చెర్లోపల్లె, సీఎంరాచపల్లె, రాజుకుంట, చింతలచెలిక గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రతిష్ట మసకబారిం దన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు, కార్మికులకు కష్టాలు మిగిలాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబునాయుడు బలపరిచేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని ప్రజలు అర్థం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో రవికుమార్‌రాజు, అనంతయాదవ్, బుంగటావుల రాజశేఖర్, పాములపాటి వెంకటేశ్వర్లు, బాలకృష్ణ యాదవ్, నాగయ్య, గోపాల్‌నాయుడు, పెరుగు కృష్ణంనాయుడు, నాగేశ్వరయ్య, బ్రహ్మయ్య, నియోజకవర్గ మహిళానాయకురాలు అనిత దీప్తి, సుప్రజ, పి.రమేష్‌బాబు, వెంకటేష్‌రాజు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.