జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా కేసుల సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2022-10-02T05:05:15+05:30 IST

రాజీ మార్గంలో కేసుల ను సత్వరం పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్‌ అదాలత్‌ చక్కటి వేదిక అని వాల్మీకిపురం జూని యర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ పేర్కొన్నా రు.

జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా కేసుల సత్వర పరిష్కారం
మాట్లాడుతున్న జడ్జి రామకృష్ణ

వాల్మీకిపురం, అక్టోబరు 1: రాజీ మార్గంలో కేసుల ను సత్వరం పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్‌ అదాలత్‌  చక్కటి వేదిక అని వాల్మీకిపురం జూని యర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ పేర్కొన్నా రు. శనివారం స్థానిక కోర్టులో  మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో సివిల్‌, కిమ్రినల్‌, బ్యాంకు రుణాల కేసులన్నీంటినీ పరిష్కరించుకునేలా కక్షిదా రులకు అవగాహన కల్పించాలని పోలీసులు, న్యాయవాదులకు సూచించారు. అలాగే ప్రతిరోజు కోర్టులో జరుగుతున్న ఫ్రీ సిట్టింగ్స్‌లో కూడా కేసులను పరిష్కరించు కోవచ్చన్నారు. సమావే శంలో సీఐ సురేష్‌, ఎస్‌ఐలు తిప్పే స్వామి, లోకేష్‌రెడ్డి, దిలీప్‌కుమార్‌, న్యాయవాదులు, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. 


Read more