ప్రత్యేక చట్టం తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-02-20T04:44:05+05:30 IST

మహిళల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏపీ ఎమ్మార్పీయస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్యమాదిగ పేర్కొన్నారు.

ప్రత్యేక చట్టం తీసుకురావాలి

ముద్దనూరు ఫిబ్రవరి19: మహిళల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఏపీ ఎమ్మార్పీయస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్యమాదిగ పేర్కొన్నారు. స్థానిక  ఉమ్మడిశెట్టి ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఏపీ ఎమ్మార్పీయస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా దండువీరయ్యమాదిగ మాట్లాడుతూ మార్చి 8 వతేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పులివెందుల మార్కెట్‌ యార్డులో మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీయస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల్లయ్యమాదిగ, పాములేటి, నాగభూషణం మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Read more