రోగుల పట్ల సహృదయంతో మెలగాలి

ABN , First Publish Date - 2022-11-24T23:55:58+05:30 IST

రోగుల పట్ల సహృదయంతో మెలగాలని ఎంపీపీ చీర్ల సురే్‌షయాదవ్‌ అన్నారు. గురువారం స్థానిక పీహెచసీలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది.

రోగుల పట్ల సహృదయంతో మెలగాలి

చెన్నూరు, నవంబరు 24 : రోగుల పట్ల సహృదయంతో మెలగాలని ఎంపీపీ చీర్ల సురే్‌షయాదవ్‌ అన్నారు. గురువారం స్థానిక పీహెచసీలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వ్యవసాయం తరువాత వైద్యరంగానికి అంత ప్రాధాన్యత ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైద్య సేవలు మరింతగా అందాల్సిన అవసరం ఉందన్నారు. పీహెచసీకి సొంత భవనంలేదని, పీహెచసీ, సీహెచసీ ప్రత్యేకత ఉండడంతో దూర ప్రాంత ప్రజలకు వైద్యసేవలు సక్రమంగా అందడంలేదని మరోచోట పీహెచసీ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ విషజ్వరాలు, అంటురోగాలు ప్రబలినా అక్కడ వైద్య సిబ్బంది వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యమందించాలని, రక్తనమూనాలు సేకరించడం, సీజనల్‌ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన జీఎన భాస్కర్‌రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పెడబల్లె ప్రదీ్‌పరెడ్డి, తహసీల్దారు ఆలీఖాన, ఎంపీడీవో జానవెస్లి, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:55:58+05:30 IST

Read more