టీటీడీలోకి సౌమ్యనాథస్వామి ఆలయం

ABN , First Publish Date - 2022-11-21T00:00:25+05:30 IST

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం దేవాదాయ శాఖ నుంచి టీటీడీలో విలీన ప్రక్రియ ఆదివారం పూర్తయింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నప్పుటి నుంచి చేసిన కృషి నేటితో ఫలించింది.

టీటీడీలోకి సౌమ్యనాథస్వామి ఆలయం
ఆలయాన్ని విలీనం చేసుకుంటున్న టీటీడీ అధికారులు

ఆస్తులతో ఆలయాన్ని విలీనం చేసుకున్న టీటీడీ అధికారులు

నందలూరు, నవంబరు 20 : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం దేవాదాయ శాఖ నుంచి టీటీడీలో విలీన ప్రక్రియ ఆదివారం పూర్తయింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నప్పుటి నుంచి చేసిన కృషి నేటితో ఫలించింది. శాస్త్రోక్తంగా దేవాదాయ శాఖ నుంచి టీటీడీకి ఆలయ ఆస్తులను సమర్పణ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి సమక్షంలో జరిగింది. రాతపూర్వకంగా బాధ్యతలను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మండల ప్రజలు, స్వామి వారి భక్తులు ఆనందం చేశారు. కార్యక్రమంలో సౌమ్యనాథస్వామి ఆలయ చైర్మన్‌ అరిగెల సౌమిత్రి చంద్రనాధ్‌, టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌ బాబు, హెచ్‌ఆర్‌ డిప్యూటీ ఈవో గోవిందరాజులు, టెంపుల్‌ జనరల్‌ సెక్షన్‌ డిప్యూటీ ఈవో గుణభూషణ్‌రెడ్డి, ఇన్వంటరీ డిప్యూటీ ఈవో దామోదరం, నాగిరెడ్డిపల్లె సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, టీటీడీ జూనియర్‌ అసిస్టెంట్‌ నిరంజన్‌, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ అధికారులు, టీటీడీ అర్చకులు, నందలూరు మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:00:25+05:30 IST

Read more