-
-
Home » Andhra Pradesh » Kadapa » Soumyanathaswamy Brahmotsavam from today-MRGS-AndhraPradesh
-
నేటి నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-07-06T04:45:24+05:30 IST
జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయమైన నందలూరు సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.

నందలూరు, జూలై 5: జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయమైన నందలూరు సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. 6వ తేదీ బుధవారం నుంచి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. దీంతో పాటు కల్యాణ వేదిక సిద్ధం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు, ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, మన్నూరు సీఐ పుల్లయ్యలు పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.