-
-
Home » Andhra Pradesh » Kadapa » Solve the problems of Sundupalle-MRGS-AndhraPradesh
-
సుండుపల్లె సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-10-02T05:19:51+05:30 IST
పాలకులు వ్యాపా రులయితే ప్రజలు బిక్షగాళ్లుగా మారుతా రని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వ నాథ్ నాయక్ విమర్శించారు.

సుండుపల్లె, అక్టోబరు 1: పాలకులు వ్యాపా రులయితే ప్రజలు బిక్షగాళ్లుగా మారుతా రని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వ నాథ్ నాయక్ విమర్శించారు. సమస్యలతో సతమత మవుతున్న సుండుపల్లె మండల ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఇలా తయా రైందని ఆయన ఆరోపిం చారు. మండల వ్యాప్తంగా తిష్ట వేసిన సమస్యలను పరిష్క రించాలని డిమాండు చేస్తూ శనివారం సుండుపల్లె సానిపాయమార్గంలో అర్ధాంతరంగా నిర్మాణం ఆగిపోయిన నీళ్ల ట్యాంకు వద్ద అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి 2012 నుంచి అధికారంలోనే ఉన్నా మండలంలో సమస్యలను ఏ రోజూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. 210 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించిన రోళ్ళమడుగు పథకం కాంట్రాక్టును 2016లో ఆయనే దక్కించుకున్నా ఇప్పటికీ పూర్తి చేయ లేదని ఆరోపించారు. ఝరికోన ప్రాజెక్టు కాలువల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య మండల అధ్యక్షుడు నాగేంద్ర నాయక్, ప్రధాన కార్యదర్శి ఆఫ్రిది, సాయి నాయక్, గణేష తదితరులు పాల్గొన్నారు