ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-09-09T04:38:44+05:30 IST

ఎనర్జీ అసిస్టెంట్‌ సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎ్‌సఈ)ని కలిసి యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ ఎం ప్లాయీస్‌ యూనియన్‌ నేతలు కోరారు.

ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి

కడప(సెవెన్‌రోడ్స్‌),  సెప్టెంబరు 8: ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎ్‌సఈ)ని కలిసి యునైటెడ్‌ ఎలక్ర్టిసిటీ ఎం ప్లాయీస్‌ యూనియన్‌ నేతలు కోరారు. గురువారం విద్యుత్‌ ఎస్‌ఈని కలిసి ఎనర్జీ అసిస్టెంట్లు, జేఎల్‌ఎం గ్రేడ్‌-2 సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా బయోమెట్రిక్‌ విధానంలో సడలింపు ఇవ్వాలని, వేతనాలు చెల్లించాలని, వారిని రెగ్యులర్‌ చేయాలని కోరారన్నారు. పోలీసు వెరిఫికేషన్‌ త్వరగా చేసి, విద్యుత్‌ ఉద్యోగులకు ఇస్తున్న మెడికల్‌ అలవెన్సు, ట్రావెలింగ్‌ ఇతర సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రమాదాలు జరిగితే వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, రెగ్యులర్‌ ఉద్యోగుల లాగానే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా విద్యుత్‌ యాజమాన్యానికి సిఫారసు చేయాలని కోరారన్నారు. ఈనెల 11న యూటీఎఫ్‌ భవ నంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఎనర్జీ అసిస్టెంట్లు అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Read more