మట్టిని తవ్వేస్తున్నారు

ABN , First Publish Date - 2022-10-01T07:16:58+05:30 IST

‘కడప నగర శివారులోని చలమారెడ్డిపల్లెలో ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి రూ.కోట్లు గడిస్తున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు’’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో

మట్టిని తవ్వేస్తున్నారు
విలేకరులతో మాట్లాడుతున్న పొలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

అధికారపార్టీ నేతలకు అధికారుల వత్తాసు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

కడప, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘కడప నగర శివారులోని చలమారెడ్డిపల్లెలో ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి రూ.కోట్లు గడిస్తున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు’’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో చలమారెడ్డిపల్లె వద్ద మట్టి తవ్వకాలకు ఐదు సంస్థలకు లీజులు ఉండేవన్నారు. వాటిని రద్దు చేసి ఎంపీ అనుచరుడికి లీజును కట్టబెట్టారన్నారు. కేటాయించిన చోట లీజు కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై బి.హరిప్రసాద్‌ ఫిర్యాదు చేస్తే అధికారులు సర్వే చేయగా, 70వేల క్యూబిక్‌ మీటర్లు అదనంగా పోయినట్లు నిగ్గు తేల్చి రూ.2.32 కోట్ల జరిమానా విధించారన్నారు. అయితే ఇక్కడ రూ.10కోట్ల మేర అక్రమాలు జరిగాయన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తవ్వేసి, దొంగ రశీదులు పుట్టించి ఇసుక అమ్ముకుంటున్నారన్నారు. ఇసుక అక్రమాలపై కలెక్టరుకు,ౖ కేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌, నేతలు ఎంపీ సురేష్‌, జిలానీబాషా తదితరులు పాల్గొన్నారు.

Read more