సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక

ABN , First Publish Date - 2022-12-12T23:30:01+05:30 IST

కడప నగరంలో జరిగిన సీఐటీయూ ఐదవ మహాసభలకు కడప నగర నూతన అధ్యక్షుడిగా పి.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకటసుబ్బయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ తెలిపారు.

సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక

కడప (సెవెన్‌రోడ్స్‌), డిసెంబరు 12: కడప నగరంలో జరిగిన సీఐటీయూ ఐదవ మహాసభలకు కడప నగర నూతన అధ్యక్షుడిగా పి.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకటసుబ్బయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ తెలిపారు. సోమవారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడాలని నిర్ణయించామన్నారు. డిసెంబరు 29, 30 తేదీల్లో నగరంలో పెద్ద ఎత్తున సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోశాధికారిగా వెంకటసుబ్బమ్మ, కార్యదర్శులుగా కేశవులు, మహేష్‌, సుబ్బరాయుడు, ఉపాధ్యక్షుడిగా సుంకర రవి, మహబూబ్‌తార, అంజనీదేవి, కమిటీ సభ్యులుగా సుదర్శన్‌, ప్రభాకర్‌, వినీల, బ్రహ్మానందరెడ్డి, రవికుమార్‌, గోవిందు, హరి, ప్రకాష్‌, కిరణ్‌, వెంగమాంబ ఎన్నికయ్యారు.

Updated Date - 2022-12-12T23:30:01+05:30 IST

Read more