-
-
Home » Andhra Pradesh » Kadapa » Sing the end of demonic rule-MRGS-AndhraPradesh
-
రాక్షస పాలనకు చరమగీతం పాడండి
ABN , First Publish Date - 2022-09-18T04:26:57+05:30 IST
రాష్ట్రంలో రావణ ప్రభుత్వమైన జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
గుర్రంకొండ, సెప్టెంబరు 17: రాష్ట్రంలో రావణ ప్రభుత్వమైన జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గుర్రంకొండ మండలం తరిగొండలో శనివారం ఒక్కరోజు అన్నక్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అత్యాచారాలు, ఆత్మహత్యలు, దౌర్జన్యాలు, వేధింపులు, అక్రమ కేసులు పెరిగాయే తప్ప ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన వైసీపీ నాయకుల భూఆక్రమణలు, ఇసుక దందా, లిక్కర్ అమ్మకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలోని పీలేరు పట్టణంలోనే వైసీపీ నాయకులు రూ.300 కోట్ల భూఆక్రమాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా..అని ప్రశ్నించారు. ఈ అవినీతిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. వైసీపీ నాయకుల అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము జగన్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కొందరూ ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ వందల కోట్లు సొమ్ము చేసుకోవడమే వీరు చేస్తున్న అభివృద్ధి అని విమర్శించారు. టీడీపీ నేతలు పేదల ఆకలి తీర్చడానికి చేపడుతున్న అన్నక్యాంటీన్‌లను అడ్డుకోవడం వైసీపీ నాయకులకు తెలిసిన అభివృద్థి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని సూచించారు. ఇందుకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాలలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఒక్కరోజు నిర్వహించిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు మూర్తిరావు, జగదీష్‌కుమార్, చంద్రబాబు, ప్రదీప్‌చంద్, దేవిక, రెడ్డిప్రసాద్‌నాయుడు, జయప్రకాశ్, హరిప్రసాద్‌నాయుడు, నారాయణ, నౌషాద్ అహ్మద్, ఎల్లుట్ల మురళి, చలమారెడ్డి, శెట్టివారి ఉమాశంకర్, క్రాంతికుమార్, ద్వారక, ప్రకాశ్, నారా వెంకటరమణ, బయ్యారెడ్డి, హుస్సేన్‌వలి, వేణుగోపాల్‌రెడ్డి, నౌషాద్ అలీ, చంద్రయ్య, రమణ, అనిల్, నాగేంద్రరెడ్డి, నాగరాజ, సుధాకర్, ఆనంద్, వెంకటేష్, మేకల చలపతి, గోవర్ధన్, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.