అరాచకపాలనకు చరమగీతం పాడండి

ABN , First Publish Date - 2022-10-01T05:21:48+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచకపాలన కు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ పిలుపునిచ్చారు.

అరాచకపాలనకు చరమగీతం పాడండి
కురబలకోటలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శంకర్‌

కురబలకోట, సెప్టెంబరు 30: వైసీపీ ప్రభుత్వ అవినీతి,  అరాచకపాలన కు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ పిలుపునిచ్చారు. శుక్ర వారం మండలంలోని అంగళ్ళు భారత్‌ కల్యాణమండపంలో ఆర్‌టీఎస్‌ శిక్షణ తరగతులు  పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ పీటీఎం మండలంలోని పాపాఘ్ని నది నుంచి నిత్యం అక్రమంగా కర్ణాటకకు ఇసుక తరలించి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. తంబళ్ళపల్లె సమీపంలోని మల్లయ్య కొండ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని అక్కడ ఆలయాన్ని కూల్చి వేసినా అందులోని మూలవిరాట్‌ విగ్రహం ఏమైందని ప్రశ్నించారు. పేదల ఆకలి తీర్చడానికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌లను పీటీఎం, ములకల చెరువులలో ఏర్పాటు చేస్తే పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.  అనంతరం రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్‌ నరహరి మాట్లాడుతూ వైసీపీ  అరాచక ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారం లోకి తీసుకురావడానికి కృషి చేయాలని, రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.  కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్‌ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు, ఆర్‌టీస్‌ శిక్షణానిపుణులు మౌనిక, రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌,   తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్‌బాషా, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి మండల కన్వీనర్‌ వైజి సురేంద్ర, మాజీ ఎంపీపీలు భూమిరెడ్డి, తిమ్మరాయుడు, ఎల్లారెడ్డి,  రెడ్డెప్ప, గుడే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సభ్యత్వ నమోదు పెంచాలి : దొమ్మలపాటి

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 30: టీడీపీ సభ్యత్వ నమోదు పెంచి పార్టీ ఇచ్చిన అనుబంధ సంఘాల పదవులకు గౌరవం తీసుకురావాలని టీడీపీ ఇన్‌చార్జి, దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  సభ్యత్వ నమోదు పెంచడంతో పాటు, బాదుడే బాదుడు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు బి.శ్రీధర్‌, పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్‌, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు మోడెం సిద్దప్ప, మం డల అధ్యక్షుడు డి.శ్రీనివాసులు, విజయకుమా ర్‌గౌడ్‌, పి.వెంకటరమణ, ఎస్‌ఏ మస్తాన్‌, ఆర్‌జే వెంకటేశ్‌, వి.వెంకటరమణ, రాణా పాల్గొన్నారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 30: పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించి శాసనమండలిలో టీడీపీ వాణి వినిపించాలని తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ పేర్కొన్నారు. శుక్ర వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మ లపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న  శ్రీకాంత్‌ మాట్లాడుతూ గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన పట్టభద్రులందరి ఓట్లు నేడు రద్దు అయ్యాయని, వాటిని తిరిగి అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 2019 అక్టోబరు 31వ తేదీకి డిగ్రీ పూర్తి చేసిన వారందరు ఓటరుగా నమోదు చేసుకోవచ్చ న్నారు.  దీనికి అక్టోబరు 1 నుంచి నవంబరు 7వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఓటరు నమోదు వివరాలను ప్రతి టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంచామని, తహసీల్దార్‌ కార్యాలయంకు వెళ్లి ఫార్మ్‌ 18తో పాటు, ఓటరు కార్డు, డిగ్రీ పట్టా జిరాక్స్‌ అందించాలన్నారు. డిప్లొ మా పూర్తి చేసిన అభ్యర్థులు  ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. 

పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలి

కలికిరి, సెప్టెంబరు 30:ప్రతి బూత్‌ పరిధిలోనూ కనీసం 50 మంది పట్టభద్రులున్నారని వారందరి ఓటరు జాబితాలో ఓటు నమోదయ్యే విధంగా బూత్‌, యూనిట్‌, కస్టర్‌ బాధ్యులు కృషి చేయాలని రాయల సీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్‌ కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ కొత్త రూపొందించిన అంతర్గత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఆర్‌టీఎస్‌ (రియల్‌ టైమ్‌ స్ట్రాటజీ) కన్వీనర్‌ జేడీ మౌనిక  రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జ్‌ గంటా నరహరి, పీలేరు మాజీ ఇన్‌చార్జి మల్లారపు రవిప్రకాష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాష్‌ తదితరులు ప్రసంగించారు. రాజంపేట ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీకాంత్‌ రెడ్డి, గీతాంజలి, ప్రభాకర్‌ నాయుడు, జగదీష్‌, మల్లికార్జున రెడ్డి, నిజాముద్దీన్‌, మాజీ జడ్పీటీసీలు రెడ్డిబాషా, మాలతి, కోటపల్లె బాబు రెడ్డి,  అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   

Read more