-
-
Home » Andhra Pradesh » Kadapa » Should excel in sports from student stage-MRGS-AndhraPradesh
-
విద్యార్థి దశనుంచే క్రీడల్లో రాణించాలి
ABN , First Publish Date - 2022-09-11T05:22:58+05:30 IST
విద్యార్థి దశనుంచే క్రీడల్లో రాణించాలని ఎం ఈవో ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

మదనపల్లె క్రైం, సెప్టెంబరు 10: విద్యార్థి దశనుంచే క్రీడల్లో రాణించాలని ఎం ఈవో ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివా రం స్థానిక జడ్పీహైస్కూల్ మైదానంలో రాష్ట్ర స్థాయి రోప్‌స్కిప్పిం గ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఎంఈవో ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడు తూ క్రీడలతో మాన సికోల్లాసం సాధ్యమ వుతుందన్నారు. రెండురోజుల పాటు రోప్‌స్కిప్పింగ్ పోటీలు జరుగుతాయని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి క్రీడాకా రులు హాజరైనట్లు చెప్పారు. పోటీల్లో భాగంగా ప్రతిభ కనబరిచిన జట్టును జాతీయ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం రెడ్డెన్నశెట్టి, రోప్‌స్కిప్పింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, మురళీ, ఉపాధ్యాయులు మహ్మద్‌ఖాన్, ఫణీంద్ర, సుధాకర్, అన్సర్, దేవకమ్మ, తదితరులు పాల్గొన్నారు.