రాష్ట్ర స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టులు ఎంపిక

ABN , First Publish Date - 2022-11-30T23:42:37+05:30 IST

బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ట్ట్ర స్థాయికి ఏడుప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కడప నగరం మున్సిపల్‌ హైస్కూలు మెయిన్‌లో బుధవారం 30వ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ

రాష్ట్ర స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టులు ఎంపిక

కడప (ఎడ్యుకేషన్‌), నవంబరు 30: బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ రాష్ట్ట్ర స్థాయికి ఏడుప్రాజెక్టులు ఎంపికయ్యాయి. కడప నగరం మున్సిపల్‌ హైస్కూలు మెయిన్‌లో బుధవారం 30వ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 124 ప్రాజెక్టులు ప్రదర్శించగా వీటిలో ఏడు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రె్‌సకు ఎంపిక చేశారు. ఈ సందర్బంగా జిల్లా సైన్స్‌ సమన్వయకర్త సుబ్బరాయుడు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ సహకరిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు, దేశానికి అవసరమైన భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రాష్ట్ర ఐటీ సెల్‌ అధికారి రెహ్మాన్‌ మాట్లాడుతూ విద్యార్థుల శాస్త్రీయ సాంకేతిక సామాజిక విషయాల గురించి అవగాహన కలిగి సైన్స్‌ కాంగ్రెస్‌ సహకరిస్తుందన్నారు. అకడమిక్‌ సమన్వయ కర్త ఆర్‌.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు.

రాష్ట స్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలు

రాష్ట్ర స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రె్‌సకు వేంపల్లె శ్రీచైతన్య హైస్కూలు విద్యార్థులు డి.దీప్తి, పూజిత రూపొందించిన ప్రాజెక్టును ఎంపిక చేశారు. అలాగే నల్లింగాయపల్లె డీవీ విద్యామందిర్‌ విద్యార్థులు కౌశిక్‌, మహేశ్వరి, రాపాడు సీబీఐటీ ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు విద్యార్థులు ఎస్‌.ఆసిఫా, ఎస్‌.అప్రా, అట్లూరు జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థులు నందగోపాల్‌, జశ్వంత్‌, బి.కోడూరు కేజీబీవీ విద్యార్థులు ఎం.వెంకటసునంద, చంద్రిక, బద్వేలు జడ్పీ హైస్కూలు విద్యార్థులు ఎ.దక్షిత, టి.నాగసాయి, తాళ్లమాపురం జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థులు డి.అజర్‌అస్మద్‌, ఎం.నవీన్‌ రూపొందించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

Updated Date - 2022-11-30T23:42:37+05:30 IST

Read more