రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపిక

ABN , First Publish Date - 2022-11-30T23:26:23+05:30 IST

మండలంలోని మల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్‌ యూసఫ్‌ రాష్ట్ర స్థాయి క్రికెట్‌కు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులునాయు డు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపిక
ఎంపికైన విద్యార్థితో ఉపాధ్యాయ బృందం

చిన్నమండెం, నవంబరు 30: మండలంలోని మల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్‌ యూసఫ్‌ రాష్ట్ర స్థాయి క్రికెట్‌కు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులునాయు డు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-17 క్రికెట్‌ విభాగం నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనపర్చి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని వ్యాయామ ఉపాధ్యాయుడు రామచంద్ర, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ బెల్లం భయ్యారెడ్డి, విద్యార్థిని ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-11-30T23:26:23+05:30 IST

Read more