96 సీసాల మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-10-02T05:10:24+05:30 IST

రెండు వేర్వే రు ప్రాంతాల్లో 96 మద్యం బాటిళ్లను స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

96 సీసాల మద్యం పట్టివేత
స్వాధీనం చేసుకున్న బాటిళ్లతో డీఎస్పీ శ్రీనివాసులు

పులివెందుల వద్ద 80, రైల్వేకోడూరు వద్ద 16 బాటిళ్లు స్వాధీనం

పులివెందుల టౌన్‌, అక్టోబరు 1: రెండు వేర్వే రు ప్రాంతాల్లో 96 మద్యం బాటిళ్లను స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పులివెందుల కనంపల్లె చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీల్లో 80 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ అందిన స మాచారం మేరకు ఎస్‌ఐ చిరంజీవి తన సిబ్బందితో కనంపల్లె చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు నుంచి సిమెంట్‌ ట్యాంకర్‌లో మద్యం బాటిళ్లను పులివెందులకు అక్రమం గా తీసుకొచ్చారన్నారు. ఇందులో యర్రప్ప శ్రీనివాస్‌, తొండూరు వెంకటయ్యను అరెస్టు చేసి 80 మద్యం బాటిళ్లను, లారీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.

వెంకట్‌రెడ్డిపల్లె క్రాస్‌ వద్ద ...

రైల్వేకోడూరు(రూరల్‌) ఆక్టోబరు 1: మండ లంలోని వెంకట్‌రెడ్డిపల్లె క్రాస్‌ వద్ద శనివా రం సంచిలో తరలిస్తున్న 16 మద్యం సీసాల ను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసి నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహ రావు తెలిపారు. 

 అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి కోడూరు వాసి అన్వర్‌ బాషను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపా రు. ఈదాడులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కానిస్టేబుల్‌ రామచంద్ర, కానిస్టేబుల్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:10:24+05:30 IST