చోరీకి గురైన బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-17T04:52:06+05:30 IST

పలు చోట్ల చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు నిందితులను అదుపు లోకి తీసుకున్నట్లు బుధవారం తలమంచిపట్నం ఎస్‌ఐ మంజు నాథ తెలిపారు.

చోరీకి గురైన బంగారం స్వాధీనం

మైలవరం, ఫిబ్రవరి 16: పలు చోట్ల చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు నిందితులను అదుపు లోకి తీసుకున్నట్లు బుధవారం తలమంచిపట్నం ఎస్‌ఐ మంజు నాథ తెలిపారు. ఇళ్లలో దొంగతనాల నివారణకు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, రూరల్‌ సీఐ కొండారెడ్డి ఏర్పాటు చేసిన టీం కేసుల విషయమై విచారణ చేస్తుండగా చిన్నకొమెర్ల బస్టాండ్‌ వద్ద జమ్మలమడుగు మండలం గూడెంచెరువు రాజీవ్‌ కాలనీకీ చెందిన మొరుగు బాబు, మొరుగు గురులక్ష్మి, పోత నబోయిన గురుబాబు, పొన్నతోట గ్రామానికి చెందిన పోతనబోయిన గురప్ప అనుమా నాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించామన్నా రు. కాగా మండల పరిధిలోని గొల్లపల్లి, చిన్నకొమెర్ల, కొండాపురం మండలం ముచ్చుమర్రి ఎస్సీ కాలనీలో దొంగతనానికి పాల్పడి నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద నుంచి 72 గ్రాముల బంగా రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.3.50 లక్షల ఉంటుందని ఎస్‌ఐ  తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

Read more