పాఠశాల పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-11-08T00:15:36+05:30 IST

పాఠశాల పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండాలని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు. పరిశుభ్రతతో విద్యార్థులకు మంచి ఆరోగ్యం లభిస్తుందని సూచించారు.

పాఠశాల పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండాలి

కడప (ఎడ్యుకేషన), నవంబరు 7 : పాఠశాల పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండాలని కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు. పరిశుభ్రతతో విద్యార్థులకు మంచి ఆరోగ్యం లభిస్తుందని సూచించారు. కడప నగరం మున్సిపల్‌ హైస్కూలులో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు, పరిసరాల పరిశుభ్రతతో పాటు టాయ్‌లెట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతామని చెప్పారు. ఆట పాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద కనబరచాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు చేరువయ్యేలా చూడాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్య సుజాతమ్మ, ఉపాధ్యాయులు, వైసీపీ నాయకులు శ్రీరంజనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T00:15:36+05:30 IST

Read more