గ్రామకంఠం భూమిని కాపాడండి

ABN , First Publish Date - 2022-09-11T05:19:12+05:30 IST

కామనూరు గ్రామ సర్వే నెంబరు 547 లోని గ్రామ కంఠం భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్న వారికి కొందరు ఉద్యో గులు సహకరిస్తున్నారంటూ సర్పంచ్‌ షమీన్‌ శనివారం స్థానిక తహసీల్దారు నజీర్‌అహ్మద్‌ ఫిర్యాదు చేశారు.

గ్రామకంఠం  భూమిని కాపాడండి

ప్రొద్దుటూరు అర్బన్‌ సెప్టెంబరు 10 : కామనూరు గ్రామ సర్వే నెంబరు 547 లోని గ్రామ కంఠం భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్న వారికి కొందరు ఉద్యో గులు సహకరిస్తున్నారంటూ సర్పంచ్‌ షమీన్‌ శనివారం స్థానిక తహసీల్దారు నజీర్‌అహ్మద్‌ ఫిర్యాదు చేశారు. ఆ భూ మి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వినతిపత్రం అందజేశారు. ఆ భూమిలో గ్రామ సచివాలయంతో పాటు, రైతు భరోసా కేంద్రం పాలకేంద్రం కట్టడానికి పంచాయతీ రాజ్‌ డీఈకి అనుమతులు ఇచ్చారన్నారు. ఈ భవనాలు నిర్మించగా మిగిలిన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన వారికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు.  పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి పనులు ప్రారంభించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-11T05:19:12+05:30 IST