ఇసుక మాఫియాతోనే.. అన్నమయ్య ప్రాజెక్టు ముప్పు!

ABN , First Publish Date - 2022-07-19T04:34:21+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు తెగి పోవడానికి ఇసుక మాఫియానే కారణమని దీని పై పూర్తిస్థాయి విచారణ చేసి బాధితులకు న్యా యం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగో తు రమేష్‌నాయుడు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఇసుక మాఫియాతోనే.. అన్నమయ్య ప్రాజెక్టు ముప్పు!

రాజంపేట, జూలై18 : అన్నమయ్య ప్రాజెక్టు తెగి పోవడానికి ఇసుక మాఫియానే కారణమని దీని పై పూర్తిస్థాయి విచారణ చేసి బాధితులకు న్యా యం చేయాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగో తు రమేష్‌నాయుడు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీలో ని జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాల యంలో కమిషన్‌ సభ్యుడు జ్ఞానేశ్వర్‌ ముల్లేకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అన్నమ య్య ప్రాజెక్టు తెగిపోయి  8 నెలలు కావ స్తున్నా ఇంత వరకు బాధితులకు న్యాయం చేయలేదన్నా రు. ఈ ప్రాజెక్టు తెగిపోవడం వల్ల అపార ప్రాణ, పంట నష్టంతోపాటు,  తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేకుండా పోయిందన్నారు.  60 రోజుల్లో ఇళ్లు కట్టిస్తామని, పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ  నేటికీ నెరవేరలేదన్నారు. ప్రాజెక్టు ఘటనకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోలేదన్నా రు. బాధితులు తమ పంట పొలాలపై తీసు కున్న రుణాలను ప్రభుత్వం రద్దు చేయలేద న్నారు. కావున బాధితులకు న్యాయం చేయడా నికి మానవ హక్కుల సంఘం సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారికి న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.  వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుం టామని మానవ హక్కుల సంఘం సభ్యులు జ్ఞానేశ్వర్‌ ముల్లే హామీ ఇచ్చినట్లు రమేష్‌ నాయుడు తెలిపారు. 

Updated Date - 2022-07-19T04:34:21+05:30 IST