ఆంక్షలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు

ABN , First Publish Date - 2022-04-25T04:45:58+05:30 IST

ఆంక్షలతో ఉద్యమాన్ని నిలువరిం చ లేరని ఉపాధ్యాయ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతు న్నారు.

ఆంక్షలతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు
పోలీసుల అదుపులో యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి

అరెస్టులపై మండిపడుతున్న ఉపాధ్యాయులు 

కడప(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 24: ఆంక్షలతో ఉద్యమాన్ని నిలువరిం చ లేరని ఉపాధ్యాయ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతు న్నారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఛలో సీఎంఓకి పిలు పివ్వడంతో దీన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా పోలీసు ఆంక్షలు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు విజయవాడ చేరుకోకుండా ముందస్తు హౌస్‌ అరెస్టు చేశారు.

జిల్లాలోయూటీఎఫ్‌ నేతలు మిగతా సంఘాల ఉపాధ్యాయులు సాధారణ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీ్‌సస్టేషన్‌లో కూర్చొబెట్టారు. ఇదేమిటని ప్రశ్ని స్తే పోరుగర్జనకు ప్రభుత్వం అనుమతించలేదని, ఒక వేళ వెళ్తే, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు తీరుపై యూటీఎఫ్‌, మిగతా సంఘ నేతలు ఉపాధ్యాయులు మండిపడ్డారు.

Read more