పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-30T23:01:24+05:30 IST

పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌) డిసెంబరు 30: పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో నిర్వహించిన సమావేశంలో నగర కార్పొరేషన్‌ కమిషనరు జీఎ్‌సఎస్‌ ప్రవీణ్‌చంద్‌, అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు పరిశ్రమల, కార్మిక, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రెడ్‌ క్యాటగిరిలో ఉన్న పరిశ్రమల్లో తగిన భద్రత కల్పించేందుకు చర్యలను చేపట్టాలన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్దపాటి ప్రమాదాలకు కారణం కావచ్చని అధికారులు సమన్వయంతో తరచూ మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ కృష్ణమూర్తి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్డు ఏపీఎస్‌ పీడీసీఎల్‌, ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఆర్టీపీపీ, ఫైర్‌శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే చర్యలు

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, జాప్యానికి, నిర్లక్ష్యంగా వ్వవహరించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ విజయరామరాజు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లీనిక్‌లు, అంగన్వాడీ భవన నిర్మాణాలు తదితర అభివృద్ధి పనుల పురోగతిపై పంచాయితీరాజ్‌ ఎస్‌ఈతో కలసి కలెక్టర్‌ ఇంజనీరింగ్‌ క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృధ్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై వేటు వే సేందుకు వెనకాడనని కలెక్టర్‌ హెచ్చరించారు. సమావేశంలో పంచాయితీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసులరెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:01:24+05:30 IST

Read more