ప్రతి కార్యకర్తతో సభ్యత్వ నమోదు చేయించాలి

ABN , First Publish Date - 2022-04-25T04:52:28+05:30 IST

తి కార్యకర్తతో తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి సూచించారు.

ప్రతి కార్యకర్తతో సభ్యత్వ నమోదు చేయించాలి
కార్యకర్తలతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

వీరబల్లి, ఏప్రిల్‌ 24:  ప్రతి కార్యకర్తతో తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి సూచించారు. మట్లి గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకుడు వెంకటేశ్వర్లునాయుడు ఇచ్చిన విందుకు  వారితో పాటు   టీడీపీ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీ చెర్మన్‌ బాలసుబ్రమణ్యం, వాయ ల్పాడు నాయకులు గంటా నరహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో యే ఎన్నికల్లో టీడీపీ తప్పక గెలుస్తుందని, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ అధైర్యపడ రాదన్నారు. ఏ సమస్య వచ్చినా తాము ముందుండి పోరాడతామని తెలిపారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టీడీపీ నాయకులు డాక్టర్‌ సుధాకర్‌,  భానుగోపాల్‌రాజు, కొల్లి వెంకట్రమణ, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Read more