నగిరిపాడుకు ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2022-09-20T05:16:04+05:30 IST

చిట్వేలి మండలం నగిరిపాడుకు ఎట్టకేలకు ఆర్టీసీ బస్సును అధికారులు కొనసాగించారు. గతంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన బస్సు ప్రజలకు అనువైన సమయాల్లో నిలిచిపోయింది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో ఈ నెల 4న వేళాపాలా లేని ఆర్టీసీ బస్సులు, ఇబ్బందుల్లో ప్రయాణికులు అన్న శీర్షికతో వార్త ప్రచురితమైంది.

నగిరిపాడుకు ఆర్టీసీ బస్సు
నగిరిపాడుకు చేరిన ఆర్టీసీ బస్సు

రాజంపేట, సెప్టెంబరు 19: చిట్వేలి మండలం నగిరిపాడుకు ఎట్టకేలకు ఆర్టీసీ బస్సును అధికారులు కొనసాగించారు. గతంలో వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన బస్సు ప్రజలకు అనువైన సమయాల్లో నిలిచిపోయింది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో ఈ నెల 4న వేళాపాలా లేని ఆర్టీసీ బస్సులు, ఇబ్బందుల్లో ప్రయాణికులు అన్న శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై డిపో మేనేజర్‌ రమణయ్య, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ డి.కృష్ణమూర్తి ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి సోమవారం ఉదయం అనువైన సమయాల్లో ఉదయం 7.30 గంటలకు ఆర్టీసీ బస్సు గ్రామం గుండా నడిచింది. ఈ మేరకు డిపో మేనేజర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల నగిరిపాడు, జెట్టివారిపల్లె, మల్లెంపల్లె, కందులవారిపల్లె, రాజారెడ్డి కాలనీ, వడ్డిపల్లె, పెద్దూరు, హరిజనవాడ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 

Read more