తవళం మీదుగా ఆర్టీసీ బస్సును నడపాలి

ABN , First Publish Date - 2022-07-19T05:12:26+05:30 IST

మదనపల్లె నుంచి తవళం మీదుగా నిమ్మనపల్లెకు ఆర్టీసీ బస్సును నడపాలంటూ గ్రామస్తులు సోమ వారం చల్లావారిపల్లె వద్ద ఽధర్నా నిర్వహిం చారు.

తవళం మీదుగా ఆర్టీసీ బస్సును నడపాలి
చల్లావారిపల్లె వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులు, విద్యార్థులు

నిమ్మనపల్లె, జూలై 18: మదనపల్లె నుంచి తవళం మీదుగా నిమ్మనపల్లెకు ఆర్టీసీ బస్సును నడపాలంటూ గ్రామస్తులు సోమ వారం చల్లావారిపల్లె వద్ద  ఽధర్నా నిర్వహిం చారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లా డుతూ ఎన్నో ఏళ్లుగా మదనపల్లె 2-డిపో నుంచి మదనపల్లె నుంచి తవళం మీదుగా బస్సు నడుస్తుందన్నారు. అయితే నెల రోజులు గా ఆ బస్సును రద్దు చేయడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నో సార్లు ఆర్టీసీ డిపో మేనేజ ర్‌కు వినతులు అందించినా ఇప్పటివరకు బస్సును వేయలేదని దీంతో ధర్నా చేపట్టామ న్నారు. దాదాపు రెండు గంటల రాకపోకలు ఆగడంతో స్థానిక పోలీసులు, 2-డిపో అధికారులు వచ్చి బస్సును పునరుద్ధరిస్తామని తెలుపడంతో ధర్నా విరమించారు.  


Read more