ఆర్టీసీ బస్సు- లగేజి జీపు ఢీ ఇద్దరు రైతులకు తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-05-19T05:26:29+05:30 IST

ఆర్టీసీ బస్సు- లగేజి జీపు ఢీ కొన్న ప్రమాదంలో వెంకటరమణ (58), పెద్దప్పోడు (61) అనే ఇద్దరు రైతులు తీవ్రం గా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్సు- లగేజి జీపు ఢీ   ఇద్దరు రైతులకు తీవ్రగాయాలు
ప్రమాదంలో గాయపడ్డ వెంకటరమణ, పెద్దప్పోడు

కురబలకోట, మే18ః ఆర్టీసీ బస్సు- లగేజి జీపు ఢీ కొన్న ప్రమాదంలో వెంకటరమణ (58), పెద్దప్పోడు (61) అనే ఇద్దరు రైతులు తీవ్రం గా గాయపడ్డారు. ఇందుకు  సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా పూలకుంటకు చెందిన రైతు లు వెంకటరమణ, పెద్దప్పోడు వారు పండించిన టమోటాలను మదనపల్లె మార్కెట్‌కు బొలెరో వాహనంలో తీసుకొచ్చారు. అక్కడ అమ్మకాలు జరిపి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో దీంతో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న రైతులు తీవ్రంగా గాయపడగా వారిని 108లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వారిలో వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. అయితే బస్సులో ప్రమా ణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో కొం తసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం జరిగిన కొద్ధిసేపటికి చెన్నామర్రి విట్ట వద్ద ఆగి ఉన్న రెండు కార్లను వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more