వరద బాధితులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలు

ABN , First Publish Date - 2022-02-17T05:10:58+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టు తెగి ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం చేయూత అందించ నుంది.

వరద బాధితులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలు
సీఎం వైఎస్‌ జగన్‌ను కలసిన ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి తదితరులు

సీఎం ప్రకటించినట్లు ఎమ్మెల్యే మేడా వెల్లడి


రాజంపేట, ఫిబ్రవరి 16: అన్నమయ్య ప్రాజెక్టు తెగి ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం చేయూత అందించ నుంది. వీరు సర్వం కోల్పోయి మూడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఇళ్లు కట్టించి ఇవ్వలేదు. ఈవిషయమై సీఎం వైఎస్‌ జగన్‌తో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి చర్చించా రు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1.80లక్షలు సరిపోదని, అందువల్లే ఇంటి నిర్మాణాలు జరగలేదని తెలపగా ఒక్కో ఇంటికి రూ.5లక్షలు నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలి పారు. ఈమేరకు వెంటనే జీవో జారీ చేస్తామని సీఎం చెప్పారని అన్నారు.

Read more