వర్షాలతో దెబ్బతిన్న రహదారులు

ABN , First Publish Date - 2022-12-13T23:58:02+05:30 IST

తుఫాన కారణంగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పలుచోట్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయి.

వర్షాలతో దెబ్బతిన్న రహదారులు
కురబలకోట మండలం చేనేతనగర్‌ వద్ద గుంతలమయమైన రోడ్డు

కురబలకోట, డిసెంబరు 13: తుఫాన కారణంగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పలుచోట్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయి. మండల పరిధిలో ముదివేడు, పిచ్చలవాండ్లపల్లె తదితర చోట్ల విద్యుత స్తంభా లు నేలకొరగడంతో పాటు విద్యుత ట్రాన్సఫార్మర్‌లు దెబ్బతినడంతో ట్రాన్సకో ఏఈ వెంకటరత్నం ఆధ్వర్యంలో విద్యుత మరమ్మతు పనుల ను చేపట్టారు. కాగా మదనపల్లె- అంగళ్ళు మార్గమధ్యంలోని చేనేతన గర్‌, టమోటా మార్కెట్‌ వద్ద రోడ్డు, మిట్స్‌ కళాశాల సమీపంలో రోడ్లు గుంతలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. తుఫాన కారణంగా ఇప్పటికే టమోటా, బంగాళదుంప, మునగ, వరి, క్యాబేజీ, వంగ తదితర పంటలు దెబ్బతినడంతో రైతన్న లు తీవ్రంగా నష్టపోయారు.

కలికిరిలో: మండలంలోని చీకటిపల్లె నుంచి కలికిరి-కలకడ రోడ్డును మంగళవారం రెవెన్యూ అధికారులు మూసివేసి ఈ రోడ్డుపై రాకపోక లను నిషేధించారు. బాహుదా నదిని దాటేందుకు వేసిన రోడ్డు నీటి ఉధృతికి దెబ్బ తినడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ దారిలో వెళ్ళేందుకు వీలు లేకుండా ముళ్ల కంపలు వేశారు. దాంతోపాటు హెచ్చరిక బోర్డు ను కూడా ఏర్పాటు చేశారు. చీకటిపల్లె, రంగనాథపురం తదితర గ్రామా ల ప్రజలు కలికిరి కలకడ రోడ్డును గడి గ్రామం వద్ద చేరుకునేందుకు బాహుదా నదిపై కాజ్‌వే నిర్మించారు. 2019లో కురిసిన వర్షాలకు ఈ కాజ్‌వే కొట్టుకుపోవడంతో ఆ తరువాత రాకపోకలకు అనువుగా పైపులు ఏర్పాటు చేసి వాటి పైన మట్టి రోడ్డు వేశారు. గత సంవత్సరం నవం బరు వర్షాలకు ఈ తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయింది. చీకటిప ల్లె, పల్లవోలు వీఆర్వోలు బి.నరేష్‌కుమార్‌, సుల్తాన బాషా, పంచాయతీ కార్యదర్శులు రమేష్‌, రెడ్డిప్రసాద్‌, వీఆర్‌ఏలు, సచివాలయ సిబ్బంది కలిసి రోడ్డు మీద రాకపోకలు లేకుండా చర్యలు చేపట్టారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న బహుదా కాలువ

మదనపల్లె అర్బన, డిసెంబరు 13: మదనపల్లెలో మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన తాకిడికి పట్టణం ఎగువ ప్రాంతాల్లో ఉన్న కుంట లు, చెరువులు మొరవలు పారుతుండడంతో పట్టణంలోని బహుదా కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం పట్టణంలోని బహు దా కాలువ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో బ్రిడ్జిని తన్నుకుని ప్రవహిస్తోం ది. వేంపల్లె, చిప్పిలి, గ్రామాల్లో ని వెంకటమ్మ చెరువు, మేడిపల్లె చెరువు, ఎగువరెడ్ల చెరువులు, బొమ్మనచెరువు పెద్దచెరువులు మొరవ లు పారుతున్న కారణంగా పట్టణంలోని బుగ్గకాలువ, కురవంక కాలువ లు బహుదా కాలువలోకి నీళ్లు కలవడంతో బహుదాకాలువ నీటిప్రవా హం పెరింగింది.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 13: మాండస్‌ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీసీహక్కుల పోరాట

సమితి వ్యవస్థాపకుడు బోడెం రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళ వారం మండలంలోని పొన్నూటిపాలెం పంచాయతీలో దెబ్బతిన్న పంట లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరిపంట కోతదశలో ఉందని, అదేవిధంగా టమోట, మొక్కజొన్న పం టలు సైతం దెబ్బతిన్నాయన్నారు. రాజంపేట, రైల్వేకోడూరు నియోజక వర్గాల్లో ఎక్కువగా అరటి, బొప్పాయి పూర్తిగా తుఫానుకు దెబ్బతినడం జరిగిందన్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరి శీలించి, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. బీసీహెచపీఎస్‌ నాయకులు రామలింగ, బండి రామచంద్ర, రామకృష్ణ, శివ, కృష్ణమూర్తి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:58:02+05:30 IST

Read more