రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తి చేయిస్తాం

ABN , First Publish Date - 2022-09-12T05:29:41+05:30 IST

కమలాపురం నగర పంచాయతీలోని పొట్టి శ్రీరాములు మెయిన బజార్‌లో ఆగిపోయి ఉన్న రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

రోడ్డు విస్తరణ పనులు త్వరలో పూర్తి చేయిస్తాం

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 11 : కమలాపురం నగర పంచాయతీలోని పొట్టి శ్రీరాములు మెయిన బజార్‌లో ఆగిపోయి ఉన్న రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ అధికారులతో మెయిన బజార్‌ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అదే విధంగా ఆ ప్రాంత నివాసితులతో మాట్లాడారు. కమలాపురం మెయినరోడ్డు విస్తరణ, డ్రై నేజీ పనులను కరోనా కారణంతో ఆలస్యం చేశారన్నారు. రోడ్డు వ్తిరణ, డ్రైనేజీ పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఒక వేళ కాంట్రాక్టర్‌ చేయలేకపోతే తన సొంత నిధులతో తానే పనులు పూర్తి చేయిస్తానని నివాసితులకు తెలిపారు. 

Read more