-
-
Home » Andhra Pradesh » Kadapa » Rising temperatures in the district-MRGS-AndhraPradesh
-
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ABN , First Publish Date - 2022-04-25T04:46:37+05:30 IST
: కడప జిల్లాలో రోజు రోజు కూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది వరకెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నాలుగో వారంలో ఏకంగా 41 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు దాటుతాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరిస్తోంది.

నేడు రేపు 16 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు
చాపాడు, సిద్ధవటంలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదు
కడప(ఎడ్యుకేషన్), ఏప్రిల్ 24: కడప జిల్లాలో రోజు రోజు కూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది వరకెన్నడూ లేని విధంగా ఏప్రిల్ నాలుగో వారంలో ఏకంగా 41 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు దాటుతాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరిస్తోంది. దీన్ని బట్టి జిల్లాలో మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఆదివారం సం బంధిత శాఖ జారీ చేసిన అంచనాలు నివేదికలో జిల్లాలో సోమ, మంగళవారాల్లో 16 మండలాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. జిల్లాలో మొత్తం 36 మండలాలు ఉండగా అందులో 16 మండలాల్లో అంటే 44 శాతం మండలాల్లో ఎండ వేడి తీవ్రంగా ఉంది. సోమవారం కొండాపురం, చాపాడు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, వేముల, తొండూరు, వీఎన్‌పల్లి, కమలాపురం, కడప, చింతకొమ్మదిన్నె, ఖాజీపేట, చక్రాయపేట, సిద్దవటం తదితర 16 మండలాల్లో 41 నుంచి 42 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మంగళ వారం 16 మండలాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు అధికారులు సూచించారు.