-
-
Home » Andhra Pradesh » Kadapa » Responsive applications should be dealt with promptly-MRGS-AndhraPradesh
-
స్పందన అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-07-19T05:03:05+05:30 IST
స్పందనకు కార్యక్రమానికి వచ్చే ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆధేశించారు.

కడప(కలెక్టరేట్), జులై 18 : స్పందనకు కార్యక్రమానికి వచ్చే ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆధేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని స్పందన హాల్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇన్‌చార్జి డీఆర్వో, స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు యధుభూషణ్ రెడ్డి, పెద్దిరాజు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. కొవిడ్ ముప్పు పూర్తిగా తొలగనందున అధికారులు, సిబ్బంది ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరిం చి, భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో సీపీవో వెంకట్రావు, ప్రొద్దుటూరు ఆర్టీఓ వీర్రాజు, ఎస్‌ఎ్‌సఏ పీడీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికారులు దుర్గాప్రసాదు తదితరులు హాజరయ్యారు.