భవన కార్మికుల పెండింగ్‌ క్లైమ్స్‌ పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-07-04T05:25:41+05:30 IST

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నందు పెండింగ్‌ లో ఉన్న క్లైమ్స్‌ను వెంటనే పరిష్కరిం చాలని ఏఐటీయూసీ నియోజక వర్గ గౌరవాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

భవన కార్మికుల పెండింగ్‌  క్లైమ్స్‌ పరిష్కరించండి

బి.కొత్తకోట జూలై 3 : భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నందు పెండింగ్‌ లో ఉన్న క్లైమ్స్‌ను వెంటనే పరిష్కరిం చాలని ఏఐటీయూసీ నియోజక వర్గ గౌరవాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం  యూనియన్‌ సర్వస భ్య సమావేశం బి.కొత్తకోటలో పి.జవహర్‌ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ స మావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికా రంలోకి వచ్చిన  వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీ ర్యం చేసి దాని నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని ధ్వజమెత్తారు. కార్మికులకు 12 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత సలీంబాషా, పెయింటర్స్‌ యూని యన్‌ నాయకులు జోహర్‌బాబు, వెంకట్‌ రెడ్డి, రమేశ్‌, శేఖర్‌, వెంకట్రమణ పాల్గొన్నారు. 


Read more