ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని వినతి

ABN , First Publish Date - 2022-10-15T04:54:08+05:30 IST

నియోజకవర్గంలోని కొండాపురం, ముద్దనూరు రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని శుక్రవారం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ఢిల్లీలో వినతి పత్రం అందించినట్లు రాత్రి 8 గంటలకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని వినతి
రైల్వే మంత్రిని కలిసిన ఆదినారాయణరెడ్డి, బీజేపీ నేతల బృందం

జమ్మలమడుగు రూరల్‌/ముద్దనూరు అక్టోబరు 14: నియోజకవర్గంలోని కొండాపురం, ముద్దనూరు రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని శుక్రవారం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ఢిల్లీలో వినతి పత్రం అందించినట్లు రాత్రి 8 గంటలకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ ఎంపీ రఘురామకృష్ణరాజు సహా కేంద్ర రైల్వే మంత్రి ఆశ్వనీ వైష్ణవ్‌ను కలిసి ఢిల్లీలో వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. 

 ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్‌ కాలం నుంచి కొండాపురం రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపేవారన్నారు. కొండాపురం మండలం రైల్వేస్టేషన్‌కు సమీపాన సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, యల్లనూరు, తదితర మండలాలు  ఉండడం వలన ఆ ప్రాంతీ యులకు సౌకర్యంగా ఉండేదన్నారు. కోవిడ్‌ సమయంలో ఈ సౌకర్యం రద్దు చేసి కొండాపురం రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపడంలేదని, తక్షణమే ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సి.రాజేష్‌రెడ్డి, సి.శివనారాయణరెడ్డి, ఎర్రగుంట్ల, కొండాపురం ప్రాంతాలకు చెందిన బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 

Read more