వక్ఫ్‌ ఆస్తులను కాపాడాలని వినతి

ABN , First Publish Date - 2022-11-30T23:17:29+05:30 IST

కడపలోని వక్ఫ్‌ ఆస్తులను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని తహసీల్దారు శివరామిరెడ్డికి ఇన్ఫాఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా, నగర అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.షాజహాన్‌, ఎస్‌.మైనుద్దీన్‌, జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ గౌస్‌ వినతిపత్రం అందించారు.

వక్ఫ్‌ ఆస్తులను కాపాడాలని వినతి
తహసీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

కడప (సెవెన్‌రోడ్స్‌), నవంబరు 30: కడపలోని వక్ఫ్‌ ఆస్తులను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని తహసీల్దారు శివరామిరెడ్డికి ఇన్ఫాఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా, నగర అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.షాజహాన్‌, ఎస్‌.మైనుద్దీన్‌, జిల్లా ఉపాధ్యక్షులు షేక్‌ గౌస్‌ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలోని బిల్డ ప్‌, రవీంద్రనగర్‌ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువైన వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని పత్రికల్లో కథనాలు వస్తున్నా ఇంత వరకూ వక్ఫ్‌ అధికారులు నో రు మెదపకపోవడం సమంజసం కాదన్నారు. ఆక్రమిత ప్రాంతాల్లో వక్ఫ్‌ బోర్డు అధికారులు చొరవ తీసుకుని పరిశీలన జరిపి వక్ఫ్‌ బోర్డు భూముల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడం కబ్జాదారుల పై చట్టరిత్యా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.

సర్వే నెం.305/1ఎ, 305/1సి సంబంధించి మిగులు భూమిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా, డిప్యూటీ సీఎం, మైనార్టీ మంత్రి అంజద్‌బాషా నియోజకవర్గంలో వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ లేకపోవడం దారుణమన్నా రు. వెంటనే ఆయా వక్ఫ్‌బోర్డు భూముల వివరాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఇన్ఫాఫ్‌ నగర ఉపాధ్యక్షులు హుసేన్‌, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కె.మునెయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:17:30+05:30 IST