-
-
Home » Andhra Pradesh » Kadapa » Release of inter supplementary results-NGTS-AndhraPradesh
-
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-08-31T06:03:55+05:30 IST
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం 29 శాతం, ద్వితీయ సంవంత్సరం 31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించారు.

కడప(ఎడ్యుకేషన్), ఆగస్టు 30: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎంవీ శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం 29 శాతం, ద్వితీయ సంవంత్సరం 31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి 11,739 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,405 మంది (29 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 10,863 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,380 మంది (31 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీ వరకు పీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చని ఆర్‌ఐవో ఎస్.వెంకటరమణరాజు తెలిపారు.