ప్రవీణ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం అక్రమం: టీడీపీ

ABN , First Publish Date - 2022-09-11T05:04:44+05:30 IST

ప్రొద్దుటూరు టీడీపీ ఇనచార్జ్‌ గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై ప్రొ ద్దుటూరు త్రీ టౌన పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి వికా్‌సహరి అన్నా రు.

ప్రవీణ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం అక్రమం: టీడీపీ

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 10 : ప్రొద్దుటూరు టీడీపీ ఇనచార్జ్‌ గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై ప్రొ ద్దుటూరు త్రీ టౌన పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం అక్రమమని ఆ పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి వికా్‌సహరి అన్నా రు. కడప నగరం అక్కాయపల్లె తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పోలీసులు వాస్తవాలు విచారించకుండా ఫిర్యాదుదారుడి పూర్వాపరాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకుడు అనగానే ముందు వెనుక ఆలోచించకుండా కేసు నమోదు చేయడం విచారకరమన్నారు. కిశోర్‌ అనే వ్యక్తి టీడీపీ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌పై దూషణకు దాడి చేయడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్నవారు అతన్ని పట్టుకుని త్రీటౌన పోలీసులకు అప్పగిస్తే పోలీసులు ప్రవీణ్‌పై కేసు నమోదు చేయడం చూస్తే ఈ రాష్ట్రంలో పో లీసు వ్యవస్థలోని కొందరు ఏ స్థాయికి దిగజారారో అర్ధం కాలేదన్నారు. ప్రవీణ్‌పై నమోదైన కేసును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం కూడా పంపుతున్నామన్నారు.

దాడి చేసేందుకు వచ్చిన కిశోర్‌ను పోలీసులు తీసుకెళ్లినా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం ఏంటని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రవీణ్‌పై దాడి చేసేందుకు టీడీపీ కార్యాలయంలోకి కిశోర్‌ను ఎవరు పంపారు? దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది? పోలీసులు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read more