ఓటు నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-19T05:13:22+05:30 IST

పశ్చిమ రాయలసీమ శాసనమండలి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలకు అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఏవీ రామక్రిష్ణమరాజు పేర్కొన్నారు.

ఓటు నమోదు చేసుకోవాలి

కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 18: పశ్చిమ రాయలసీమ శాసనమండలి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలకు అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఏవీ రామక్రిష్ణమరాజు పేర్కొన్నారు. మంగళవారం పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన పూర్తి చేసిన వారు సెకండరీ పాఠశాలలో మూడు సంవత్సరాలు సర్వీసు పూర్తయిన ప్రతి ఉపాధ్యాయుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. నవంబరు 7లోగా సమీపంలోని తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో కానీ, ఆనలైన ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు గతంలో ఉన్న అన్ని గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ ఓట్లను రద్దు చేసిన కారణంగా ప్రతి ఒక్కరూ  నూతనంగా ఓట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అల్లూరి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి కూరాకు రవీంద్ర పాల్గొన్నారు.

Read more