దళితుల భూములకు రికార్డులు మార్చేశారు

ABN , First Publish Date - 2022-08-02T05:08:09+05:30 IST

వందేళ్లకు పైగా మా భూములు సాగు చేసుకుం టున్నాం..ఇప్పుడు పాసుపుస్తకాలకు దర ఖాస్తు చేస్తే మా పేరిట భూములు లేవని రికార్డులే మార్చేశారని దళిత రైతులు గోడు వెల్లబోసుకున్నారు.

దళితుల భూములకు రికార్డులు మార్చేశారు
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌ వద్ద మాట్లాడుతున్న దళిత రైతులు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 1: వందేళ్లకు పైగా మా భూములు సాగు చేసుకుం టున్నాం..ఇప్పుడు పాసుపుస్తకాలకు దర ఖాస్తు చేస్తే మా పేరిట భూములు లేవని రికార్డులే మార్చేశారని దళిత రైతులు గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డీఏవో శేషయ్య ప్రజ ల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సంద ర్భంగా తట్టివారిపల్లెకు చెందిన యు.చిన్నప్ప మాట్లాడుతూ తమ పూర్వీకుల పేరిట 1914లో సర్వేనెంబర్‌ 418-1లో 1.96 ఎకరాల భూమి సెటిల్‌మెంట్‌ పట్టా ఇచ్చారన్నారు. తాను  ఆర్మీలో జవానుగా చేరి 1965-71 పాక్‌ యుద్ధంలో కూడా పాల్గొన్నానని, అటువంటి తనకు పిత్రార్జితంగా వచ్చిన భూమికి పాసుపుస్తకం మంజూరు చేయలేదన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులను అడిగితే సదరు భూమికి సంబంధించి రికార్డులో తమపేర్లు లేవని చెబుతున్నారన్నారు. ఈ విషయమై రెండు సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని చిన్నప్ప, అతని సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన యశోదమ్మ పేరున వున్న 94 సెంట్ల భూమిని ఓటీఎస్‌ చేశారని, ఇది తొలగించాలని రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా పరిష్కారం కాలేదని బాధితురాలు ఫిర్యాదు చేశారు. రామసముద్రం మండలం మినికి పంచాయతీ గుంతవారిపల్లె నుంచి పుంగనూరు రోడ్డు వెళ్లేందుకు కాలిబాట వుండగా కొందరు ఈ దారిని మూసివేశారని వాపోయారు.   స్పందనలో 63 మంది అర్జీలు అందజేశారు.


Read more