పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులను పున ర్నిర్మించండి

ABN , First Publish Date - 2022-03-17T04:55:36+05:30 IST

ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులను పునర్నిర్మించాలని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కలిసి కోరినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు.

పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులను పున ర్నిర్మించండి

సుండుపల్లె, మార్చి 16: ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులను పునర్నిర్మించాలని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కలిసి కోరినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం శాసనమండలికి వచ్చిన మంత్రిని కలిసి పునర్మిర్మాణంలో జాప్యం జరిగితే సాగునీరు, తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తాయని, వెంటనే నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరగా ప్రభుత్వ పరిశీలనలో ఉందని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. సుండుపల్లె మండలానికి సాగునీటిని అందించే ఝరికోన ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు చేస్తున్నామని, తప్పనిసరిగా పరిశీలన చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 371 మండలాల్లో వైఎ్‌సఆర్‌ జలసిరి పథకం కింద 10,661 బోర్లు వేశారని, వాటికి అవసరమైన పైపులు, మోటార్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించినప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతుందని వెంటనే  కల్పించాలని శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వానికి సూచన చేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. 

Updated Date - 2022-03-17T04:55:36+05:30 IST