తొలి తెలుగు స్వతంత్ర నాటక కర్త రామకృష్ణమాచార్యులు

ABN , First Publish Date - 2022-11-30T23:14:46+05:30 IST

తెలుగు సాహిత్య చరిత్రలో స్వ తంత్ర నాటక రచనకు నాంది పలికిన తొలి స్వతంత్ర నాటక క ర్త పితామహుడు ధర్మవరం రా మకృష్ణమాచార్యులని సీపీబ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బా ధ్యులు మూల మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.

తొలి తెలుగు స్వతంత్ర నాటక కర్త రామకృష్ణమాచార్యులు
రామకృష్ణమాచార్యులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

కడప (కల్చరల్‌) నవంబరు 30: తెలుగు సాహిత్య చరిత్రలో స్వ తంత్ర నాటక రచనకు నాంది పలికిన తొలి స్వతంత్ర నాటక క ర్త పితామహుడు ధర్మవరం రా మకృష్ణమాచార్యులని సీపీబ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బా ధ్యులు మూల మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. స్థానిక బ్రౌన్‌ భా షా పరిశోధన కేంద్రంలో రామకృష్ణమాచార్యులు వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడుతూ తెలుగు నాటక రంగ చరిత్రలో ఆంధ్రనాటక పితామహుడుగా సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ధర్మవరం రామకృష్ణమాచార్యులన్నారు. ఈయన 1853లో అనంతపురం జిల్లా ధర్మవరంలో జన్మించి, బళ్లారిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. నాటక కర్తగా, దర్శకుడిగా, నటుడిగా నాటక రంగానికి ఎనలేని సేవలందించారన్నారు.

ధర్మవరం 29 నాటకాలను రచించారని, అందులో 14 నాటకాలు ముద్రింపబడి మిగిలిన 15 నాటకాలు అముద్రితాలు గా వున్నాయన్నారు. కార్యక్రమంలో బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, సిబ్బంది, వెంకటరమణ, పాఠకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:14:46+05:30 IST

Read more