అన్నమయ్య జిల్లా ఐటీఐ కన్వీనర్‌ కేంద్రంగా రాజంపేట

ABN , First Publish Date - 2022-06-13T05:21:54+05:30 IST

అన్నమ య్య జిల్లా పారిశ్రామిక శిక్షణా సంస్థ కన్వీనర్‌ కేంద్రంగా రాజం పేటను ఎంపిక చేస్తూ రాష్ట్ర ఉపాఽధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఉత్త ర్వులు జారీ చేసినట్లు రాజం పే ట పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రి న్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ కె.శ్రీని వాసరావు వెల్లడించారు.

అన్నమయ్య జిల్లా ఐటీఐ కన్వీనర్‌ కేంద్రంగా రాజంపేట

రాజంపేట, జూన్‌12: అన్నమ య్య జిల్లా పారిశ్రామిక శిక్షణా సంస్థ కన్వీనర్‌ కేంద్రంగా రాజం పేటను ఎంపిక చేస్తూ రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఉత్త ర్వులు జారీ చేసినట్లు రాజం పే ట పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రి న్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ కె.శ్రీని వాసరావు వెల్లడించారు. రాజంపే టలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్స రానికి ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. 13 నుంచి 30వ తేదీ వరకు ద రఖాస్తు చేసు కోవచ్చన్నారు. జిల్లాలో మూడు ప్రభుత్వ పారిశ్రా మిక శిక్షణ సంస్థలు, 12 ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏపీ గవర్నమెంట్‌ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ను పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నా రు. వివరాలకు 9848453442కు సంప్రదించాలన్నారు. 

Read more