విజయదుర్గాదేవి ఆలయంలో వైభవంగా రాహుకాల పూజలు

ABN , First Publish Date - 2022-11-15T23:45:25+05:30 IST

విజయదుర్గాదేవి ఆలయంలో మం గళవారం రాహుకాల పూజలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన నిమ్మకాయల దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

విజయదుర్గాదేవి ఆలయంలో వైభవంగా రాహుకాల పూజలు
విజయదుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజల్లో పాల్గొన్న భక్తులు

కడప (కల్చకల్‌), నవంబరు 15: విజయదుర్గాదేవి ఆలయంలో మం గళవారం రాహుకాల పూజలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన నిమ్మకాయల దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4-30 గంటల వరకు రాహుకాల పూజలను మహిళలు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-11-15T23:45:25+05:30 IST

Read more