-
-
Home » Andhra Pradesh » Kadapa » Rachamallu has no moral right to criticize-NGTS-AndhraPradesh
-
విమర్శించే నైతిక హక్కు రాచమల్లుకు లేదు
ABN , First Publish Date - 2022-07-05T05:36:41+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు క్రైం, జూలై 4 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లుకు సొంతపార్టీలోనే అసమ్మతి ఎక్కువైందని, దీన్ని కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ నేతలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా, ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురనీయనని మేకపోతు గాంఽభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. రాచమల్లుపై కార్యకర్తల్లో నెలకొన్న అసమ్మతి వైసీపీ ప్లీనరీలో బయటపడిందన్నారు. అహంకార ధోరణితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. అంతకు మించి మాట్లాడాల్సివస్తుందని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. ఇప్పటికైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు.