సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2022-11-24T23:53:22+05:30 IST

సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు సేవ చేయాలని ఎంపీపీ శ్రీదేవి పేర్కొన్నారు.

సమయపాలన పాటించాలి

కలకడ, నవంబరు 24:సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు సేవ చేయాలని ఎంపీపీ శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం ఆమె బాటవారిపల్లె సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాల అమలకు కృషి చేయాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సాంకేతిక సమస్యలు రాకుండా చూడండి

వాల్మీకిపురం, నవంబరు 24: సచివాలయాలలో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవాలని వాల్మీకిపురం ఎంపీడీవో షబ్బీర్‌అహ్మద్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల పరిషత కార్యాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ నిర్వహించారు. సచివాలయాలలో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఈవో ఆర్‌డీ శకుంతల, ఈవో ఉదయ్‌కుమార్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌లు, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

కలికిరి, నవంబరు 24: సచివాలయ ఉద్యోగులందరికీ సాంకేతికపర మైన పరిజ్ఞానం ఉండాలని మదనపల్లె డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధి కారి లక్ష్మీపతి పేర్కొన్నారు. ప్రధానంగా డిజిటల్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సాంకేతిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఎదుర వుతున్న సమస్యలపై సచివాలయ ఉద్యోగుల శిక్షణ కార్యక్రమంలో లక్ష్మీపతి పాల్గొన్నారు. అనంతరం కలికిరి సచివాలయం-3ని సంద ర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగయ్య, ఈవోపీఆర్డీ అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:53:22+05:30 IST

Read more