-
-
Home » Andhra Pradesh » Kadapa » Public problems must be solved quickly Collector-NGTS-AndhraPradesh
-
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2022-06-07T05:41:47+05:30 IST
వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు.

కడప(కలెక్టరేట్) జూన్ 6 : వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రజాఫిర్యాదుల స్పందన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, డీఆర్వో మలోల, స్పెషల్ కలెక్టర్ రామమోహన్, జిల్లా అధికారులు యధుభూషణ్ రెడ్డి, మధు సూదనరెడ్డిలు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలపై వచ్చిన వృద్ధులు స్పందన హాలులోకి రాలేక అర్జీలు రాసే వద్దే ఉండి పోవడంతో డీఆర్వో మలోల, ఏఓ గంగయ్యలు వారి వద్దకే వెళ్లి అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జ్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటూ, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా కలెక్టర్, జేసీ, అధికారులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు పరిష్కారం అందించాలన్నారు. కొవిడ్ ముప్పు తగ్గలేదని అధికారులు, సిబ్బంది పోటోక్రాల్ తప్పక పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.