ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-31T05:25:41+05:30 IST

సచివాలయాలకు వచ్చే ప్రజల సమస్యలతోపాటు రోజువారీ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరిషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలి
నిమ్మనపల్లె రాచవేటివారిపల్లెలో ఇళ్ల స్థలాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

 ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలి

 సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ గిరిషా ఆదేశం

బి.కొత్తకోట మే 30 : సచివాలయాలకు వచ్చే ప్రజల సమస్యలతోపాటు రోజువారీ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని  అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరిషా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని ఆయన  సూచించారు. సోమవా రం బి.కొత్తకోట మండలంలో పర్యటించి గట్టు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేసి సచివాలయ ఉద్యోగుల హాజరు, ఉద్యోగుల రిజిష్టర్‌, సంక్షేమ పథకాల క్యాలండర్‌, తదితర అంశాలను పరిశీలించా రు. ఇప్పటి వరకు సచివాలయానికి వచ్చిన అర్జీలు, వాటిలో పరిష్కారం అయినవి అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజలకు అవసరమైన అన్నీ రకాల సేవలను ఇంటి వద్దనే అందిం చేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అందరు సక్రమంగా విధులు నిర్వహించి ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆ తరువాత ఆయన బి.కొత ్తకోట సమీపంలోని కురవవానికుంట లే అవుట్‌ స్థలాన్ని పరిశీలించారు. ఎంత మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారని తహసీల్దార్‌ ధనం జయులును అడిగి తెలుసుకోవడంతోపాటు వెంటనే గ్రౌండింగ్‌ అయ్యేలా చర్యలు చేపట్టాలని హౌసింగ్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండలంలో  జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించా రు.  అంతకు క్రితం ఆయన మదనపల్లె డీఎల్పీవో లక్ష్మి, బి.కొత్తకోట ఎంపీడివో శంకరయ్య, తహసీల్దార్‌ దనంజయులుతో మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌లో ఎన్యూమరేషన్‌, సర్వే పనులు ఎంత వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. సమగ్రంగా సర్వే, ఎన్యూమరేషన్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మదనపల్లె ఆర్డీవో మురళి, డిఎల్పీవో లక్ష్మి, బి.కొత్తకోట తహసీల్దార్‌ దనంజయులు, ఎంపీడివో శంకరయ్య, హౌసింగ్‌ ఎఈ సత్యనారాయణ, సర్వేయర్‌ శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.  

ఇంటి స్థలాల పరిశీలన

నిమ్మనపల్లె, మే 30: మండలంలోని రాచవేటివారిపల్లె సమీపంలో గల ప్రభుత్వ భూమిని  సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె అర్బన్‌ కాలనీలు నిర్ధారించేందుకు స్థలాన్ని పరిశీలనకు వచ్చానన్నారు. కాగా గతంలో 90ఎకరాల్లో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ఈస్థలాన్ని కేటాయించగా మరళా మార్పు చేయడంతో కాలేజీ వెనక్ను వెళ్లింది. దీంతో మరొక చొట స్థలాన్ని కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మురళి, తహసీల్దార్‌ మంజుల, సర్వేయర్‌ షాన్‌వా జ్‌, వీఆర్వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-05-31T05:25:41+05:30 IST