నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ABN , First Publish Date - 2022-09-18T04:40:03+05:30 IST

ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక ఏజన్సీ నిర్వాహకులు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంఈవో శంకరయ్య తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం జడ్పీ హైస్కూల్‌లో ఎంఈవో శంకరయ్య అధ్యక్షతన శనివారం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక ఏజన్సీ నిర్వాహకులకు సమావేశం జరిగింది.

నాణ్యమైన భోజనాన్ని అందించాలి

సిద్దవటం, సెప్టెంబరు 17: ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక ఏజన్సీ నిర్వాహకులు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంఈవో శంకరయ్య తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటం జడ్పీ హైస్కూల్‌లో ఎంఈవో శంకరయ్య అధ్యక్షతన శనివారం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక ఏజన్సీ నిర్వాహకులకు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచాలని ప్రాధమిక పాఠశాలలోని ఒక్కొక్క విద్యార్థికి రూ.5.40 ఇస్తుండగా దీన్ని రూ.5.88కి ప్రభుత్వం పెంచిందన్నారు. అలాగే ప్రాఽథమికోన్నత పాఠశాలలో విద్యార్థికి రూ.7.85 నుంచి రూ.8.57కు పెంచడం జరిగిందన్నారు. ఈ పెంపు సెప్టెంబరు 1వ నుంచి అమలులోకి వస్తాయన్నారు. మండల పరిధిలో ఉన్న ఏజన్సీ నిర్వాహకులు మెనూ ప్రకారం నాణ్యత పెంచాలని వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు, మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. 

Read more